
కత్రిన కైఫ్ హోమ్ మేకర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. “హోమ్ స్వీట్ హోమ్” అంటూ కొత్త ఫోటోలను షేర్ చేసింది. హీరో విక్కి కౌశల్ ని పెళ్లాడిన తర్వాత కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. అక్కడే కాపురం. కాపురం మధురానుభూతులను అందిస్తోంది అనిపిస్తోంది.
తాను ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలియచేసేలా కొత్త ఇంట్లో నుంచి ఫోటోలను షేర్ చేస్తోంది. ఒక చిన్న షార్ట్ వేసుకొని, పైన స్వేట్టర్ ధరించి… సోఫాలో కూర్చున్న ఫోజులో దిగిన ఫోటోలను పెట్టింది. ఈ ఫొటోల్లో ఆమె మంగళసూత్రం హైలెట్ అని చెప్పాలి.
38 ఏళ్ల కత్రిన ప్రేమించి పెళ్లి చేసుకొంది. ఐతే, సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనల్లో లేదు. సినిమాలు కంటిన్యూ చేస్తోంది కత్రిన. తాజాగా విజయ్ సేతుపతి సరసన కూడా ఒక మూవీ ఒప్పుకొంది.
ముంబైలోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్ లో విక్కి కౌశల్, కత్రిన జంట కాపురం పెట్టింది. హీరోయిన్ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు వీరి నైబర్స్.