కత్రినాకి కూడా కరోనా

బాలీవుడ్ నటులందరూ కరోనా బారిన పడుతున్నారు. గతేడాది పీక్ రేంజులో కరోనా కల్లోలం రేపిన టైంలోనూ కరోనాని నుంచి తప్పించుకున్నారు బాలీవుడ్ అగ్ర తారలు. కానీ ఈ సారి మాత్రం మొత్తం బాలీవుడ్ ని షేక్ చేస్తోంది కరోనా.

లేటెస్ట్ గా కత్రినా కైఫ్ కి కూడా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. “నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఐసోలేషన్ కి వెళ్ళిపోయాను. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను,” అని కత్రినా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

ఆమె బాయ్ ఫ్రెండ్ వికీ కౌశల్ కి (‘యూరి’ హీరో) కూడా రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే అక్షయ్ కుమార్, అలియా భట్, భూమి పెడ్నేకర్ వంటి తారలందరూ కరోనాతో బాధపడుతున్నారు. రణబీర్ కపూర్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడు.

More

Related Stories