కత్రిన పెళ్ళి విందు మెనూ ఇదే

Katrina Kaif

హీరోయిన్ కత్రిన పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్ లోని ఒక ప్యాలస్ లో ఆమె పెళ్లి వేడుక. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ఆమె పెళ్లాడనుంది. డిసెంబర్ 9న వీరి పెళ్లి ముహూర్తం.

సంగీత్, హల్దీ, ఇతర సంబరాలు మొదలయ్యాయి. ఈ మూడు రోజులు అతిథులకు అదిరిపోయే భోజనాలు ఏర్పాటు చేశారట. కర్ణాటక, తమిళనాడు, ముంబై, ఢిల్లీ, చండీగఢ్… ఇలా ప్రాంతాల నుంచి కూరగాయలు, మసాలాలు, ఇతర దినుసులు, స్వీట్స్ లారీల కొద్దీ తెప్పించారట.

ప్రతిరోజూ పంజాబీ వంటకాల మెనూ ఉంటుంది. విక్కీ కౌశల్ కుటుంబం పంజాబీకి చెందినవారు. చికెన్ టిక్కా, సరసో కి సాగ్, మచిలీ అమృత్సరి, బటర్ చికెన్, ముఘలాయ్ మటన్ ఫ్రై, దాల్ మకాని, బెంగాలీ స్వీట్స్, కొల్హాపురి చికెన్, బటర్ చికెన్, కడి పకోడీ, లెమన్ చికెన్, బాంబిల్, గలవాటి కబాబ్, నిహారి కుల్చ, మలై పాన్…. ఇలా లిస్ట్ సాగుతుంది. రోటీలు, నాన్ లు, ఐస్ క్రీములు, పిజ్జాలు, చాట్లు, స్వీట్లు కామన్.

దేశి వంటకాలతో పాటు విదేశీ వంటకాల మెనూ కూడా ఉందట.

Advertisement
 

More

Related Stories