కౌశల్ ఓవరాక్షన్ పై ట్రోలింగ్

Kaushal Manda

బిగ్ బాస్ సీజన్-2 విన్నర్ గా నిలిచిన కౌశల్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇతడి నుంచే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఫ్యాన్ గ్రూపులు క్రియేట్ అయ్యే సంప్రదాయం మొదలైంది.. ఆ ఫ్యాన్ గ్రూప్ ల అండతోనే ఇతడు టైటిల్ విన్నర్ గా కూడా నిలిచాడు. అయితే ఆ తర్వాత చేసిన ఓవరాక్షన్ తో కౌశల్ తన క్రేజ్ మొత్తం పోగొట్టుకున్నాడు. తాజాగా మరోసారి ఇతడిపై ట్రోలింగ్ నడుస్తోంది.

బాయ్ కాట్ చైనా గూడ్స్ అంటూ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ నడుస్తున్న నేపథ్యంలో కౌశల్ కూడా కెమెరా ముందుకొచ్చాడు. తను కూడా చైనా ఉత్పత్తుల్ని బాయ్ కాట్ చేస్తున్నానంటూ ఒప్పో ఫోన్ ను నేలకేసి కొట్టాడు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ ఫోన్ ఓ బహుమతి. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ అందుకున్న గిఫ్ట్ అది. అలాంటి బహుమతిని పగలగొట్టడంతో అంతా కౌశల్ పై ఫైర్ అవుతున్నారు. నానా తిట్లు తిడుతున్నారు.

చైనా వస్తువులు నిషేధించడమంటే ఉన్న వస్తువులు పగలగొట్టడం కాదని, కొత్తగా చైనా ప్రొడక్ట్స్ కొనకుండా ఉంటే చాలని కౌశల్ కు గడ్డిపెడుతున్నారు నెటిజన్లు. మరీ ముఖ్యంగా అతడికి జీవితకాల గుర్తింపు తీసుకొచ్చిన బిగ్ బాస్ షోకు సంబంధించి ఓ జ్ఞాపకాన్ని కౌశల్ పగలగొట్టడంతో, స్వయంగా ఫ్యాన్సే అతడిపై విరుచుకుపడుతున్నారు. బుద్ధిలేని పని చేశావంటూ తిడుతున్నారు.

అలా చైనా వస్తువుల్ని బాయ్ కాట్ చేయమంటూ పిలుపిచ్చిన కౌశల్ మరోసారి ట్రోలింగ్ కు గురయ్యాడు

Related Stories