క‌విత విడుదల చేసిన ‘సౌండ్ పార్టీ’ పోస్టర్

వి.జె.స‌న్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా న‌టిస్తున్న మూవీ.. ‘సౌండ్ పార్టీ’. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. దీనికి సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ మూవీ పోస్ట‌ర్ ను ఈ రోజు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవిష్క‌రించారు.

“సౌండ్ పార్టీ` టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంట‌ర్టైనింగ్ గా ఉండ‌బోతున్న‌ట్లు టైటిల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా హిట్ కావాలి అని కోరుకుంటున్నా,” అని అన్నారు కవిత.

“షూటింగ్ పూర్తి అయింది. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం. మా పోస్టర్ కి, టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది,” అని అన్నారు నిర్మాత ర‌వి పోలిశెట్టి.

“మా సౌండ్ పార్టీ చిత్రం పోస్ట‌ర్ క‌విత గారు లాంచ్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా కూడా బాగా వస్తోంది,” అని ఆనందం వ్యక్తం చేశారు హీరో సన్నీ.

Advertisement
 

More

Related Stories