
హీరోయిన్ కావ్య థాపర్ ఇంకా పాపులర్ కాలేదు. మాములు ప్రేక్షకులకు ఆమె అంతగా పరిచయం లేదు. కానీ కుర్రకారుకు ఆమె నచ్చింది. అందుకే, దర్శక, నిర్మాతలు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు.
కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు వారం గ్యాప్ లోనే వచ్చాయి. గతవారం విడుదలైన “ఈగిల్”లో ఆమె రవితేజ మనసు దోచుకున్న భామగా నటించింది. ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా నటించినప్పటికీ ఆమె రవితేజకి జోడి కాదు. ఐతే, “ఈగిల్”లో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇక ఈ శుక్రవారం విడుదల అవుతున్న “ఊరు పేరు భైరవకోన” సినిమాలో కూడా ఈ భామ నటించింది. ఐతే, ఇందులో ఆమె మెయిన్ హీరోయిన్ కాదు. వర్ష బొల్లమ్మ హీరో సందీప్ కిషన్ కి లవర్ గా నటించింది. రెండు డ్యూయెట్ లు కూడా వర్షకే ఉన్నాయి. ఈ సినిమాలో కావ్య థాపర్ రెండో హీరోయిన్ గా నటించింది. మొత్తమ్మీద కేవలం ఏడు రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు వచ్చాయి.
ఇక ఈ భామ ఈ ఏడాది మరో రెండు సినిమాల్లో కనిపించనుంది.
రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తీస్తున్న “డబుల్ ఇస్మార్ట్”లో కావ్య థాపర్ హీరోయిన్. అలాగే గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తీస్తున్న సినిమాలో కూడా ఈ భామే కథానాయిక.