కావ్య: రవితేజతో కెమిస్ట్రీ కుదిరింది

Kavya Thapar


హీరోయిన్ కావ్య థాపర్ మొదటిసారి రవితేజ సరసన నటించింది. ఈ భామ ఇంతకుముందు తెలుగులో “ఈ మాయ పేరేమిటో”, “ఏక్ మిని కథ” వంటి సినిమాల్లో నటించింది. “బిచ్చగాడు 2″లో కూడా కనిపించింది. తాజాగా రవితేజ సరసన “ఈగిల్”లో రొమాన్స్ చేసింది. వచ్చేవారం “ఊరు పేరు భైరవకోన” సినిమాతో కూడా మనల్ని పలకరించనుంది. త్వరలో రామ్ సరసన “డబుల్ ఇస్మార్ట్”లో కనిపిస్తుంది.

ప్రస్తుతం తెలుగులో బిజీగా సినిమాలు చేస్తున్న ఈ భామ “ఈగిల్” సినిమా గురించి మీడియాతో ముచ్చటించింది.

  • “ఈగిల్”లో రచన అనే అమ్మాయిగా నటించాను. ఇది యాక్షన్ సినిమానే కానీ అద్భుతమైన ప్రేమకథ కూడా వుంది. రవితేజ గారితో నాకు మంచి కెమిస్ట్రీ కుదిరింది. మా రొమాన్స్ యూనిక్ గా ఉంటుంది అని చెప్పగలను. రవితేజ చాలా పాజిటివ్ ఎనర్జీతో వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి.
  • పోలాండ్, లండన్ ఇలా అద్భుతమైన ఫారిన్ లోకేషన్స్ లో సినిమాని తీశారు. సినిమా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది.
  • నాకు వ్యక్తిగతంగా యాక్షన్ సినిమా చేయాలని ఉంది. అలాగే సూపర్ నేచురల్ సినిమాలు చేయాలని వుంది.
Gallanthe
  • వచ్చేవారం “ఊరు పేరు భైరవకోన” విడుదల అవుతుంది. ఈ ఏడాది ఇంకో రెండు సినిమాలు వస్తాయి నా నుంచి.
Advertisement
 

More

Related Stories