కీర్తి వెబ్ కష్టాలు, ఇష్టాలు!

Keerthy Suresh


హీరోయిన్ గా మంచి స్థితిలో ఉన్న కీర్తి సురేష్ … వెబ్ సినిమాలు చెయ్యడంలో కూడా ముందు ఉంది. కరోనా లాక్డౌన్ టైంలో కీర్తి సురేష్ నటించిన పలు చిత్రాలు ఓటిటి వేదికపైకి వచ్చాయి. ‘మిస్ ఇండియా’, ‘పెంగ్విన్’ వంటివి డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలయ్యాయి. ఇప్పుడు లాక్డౌన్ లేదు. అయినా, ఆమె వెబ్ సినిమాలు ఆపడం లేదు.

తాజాగా ఆమె ‘చిన్ని’ అనే (తమిళంలో ‘Saani Kaayidham’) సినిమా చేసింది. అది అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. ఈ సినిమా బాగుందని చూసిన వారు మెచ్చుకుంటున్నారు. కీర్తి సురేష్ ఇందులో పూర్తిగా డిగ్లామరైజ్ రోల్ చేసింది. ఐతే, కీర్తికి రావాల్సిన పేరు మాత్రం రావడం లేదు.

ఇప్పటికే ఆమె నటించిన పలు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు వెబ్ (OTT)లోకి వచ్చాయి. కానీ, ఏది కూడా ఆమెకి బాగా పేరు తీసుకురాలేదు. ఆమె కష్టానికి గుర్తింపు రావట్లేదు. ఐతే, ఈ వెబ్ సినిమాలు మాత్రం ఆపాలనుకోవడం లేదు ఈ భామ. ఎందుకంటే తక్కువ టైంలో ఇలాంటి చిత్రాలు పూర్తి అవుతాయి. పారితోషికం ఫుల్లుగా వస్తుంది.

‘సర్కారు వారి పాట’, ‘భోళా శంకర్’ వంటి పెద్ద చిత్రాలు చేస్తే పాపులారిటీ పెరుగుతుంది. పారితోషికం కూడా బాగుంటుంది. కానీ వాటి షూటింగ్ లు పూర్తి కావాలంటే ఏడాదిపైనే పడుతుంది. అలా, డేట్స్, టైం వేస్ట్ అవుతాయి. అందుకే, వెబ్ చిత్రాలు ఒప్పుకుంటోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుంది కదా.

Advertisement
 

More

Related Stories