కీర్తి సురేష్ కి సడెన్ గా రెండు హిందీ ప్రాజెక్టులు వచ్చాయి. ఆమె చాలాకాలంగా బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అనుకుకోకుండా ఒకేసారి రెండు హిందీ ప్రాజెక్ట్స్ ఆమె వళ్ళో వాలాయి.
ఆమె ఒక హీరోయిన్ గా YRF సంస్థ ఒక వెబ్ సిరీస్ ని తాజాగా ప్రకటించింది. ఇందులో రాధికా ఆప్టే కూడా నటిస్తోంది. “అక్క” అనే పేరుతో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ హిందీలో తీస్తున్నారు. ఆమెకి ఇది బాలీవుడ్ మార్కెట్ కి లాంచ్ లాంటిది.
ఇక ఆమె హిందీ సినిమా కూడా సైన్ చేసింది. “జవాన్” సినిమాతో బాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న తమిళ దర్శకుడు అట్లీ హిందీలో రెండు సినిమాలు నిర్మించనున్నాడు. తాను నిర్మాతగా వ్యవహరించే ఒక సినిమాలో కీర్తి సురేష్ కి రోల్ ఇచ్చాడు అట్లీ. కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్.
మొత్తానికి ఆమె బాలీవుడ్ కల నెరవేరుతుంది. ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ తో ఆమె హిందీ రంగంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి.