సిస్టర్ గా మారుతోన్న కీర్తి సురేష్!


కీర్తి సురేష్ దక్షిణాదిలో లీడింగ్ హీరోయిన్లలో ఒకరు. మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో ఆయనకి లవర్ గా నటిస్తోంది. పెద్ద హీరో సరసన మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నఈ భామ మరోవైపు చెల్లెలు పాత్రలు కూడా ఒప్పుకుంటోంది. జనరల్ గా ఫేమ్ ఉన్న, ఫామ్ లో ఉన్న భామలు అలాంటి పాత్రలకు ఒప్పుకోరు. కానీ కీర్తి సురేష్ మాత్రం అలాంటి నియమాలు పెట్టుకోలేదు.

ఆమె దర్జాగా రెండు సినిమాల్లో సిస్టర్ గా కనిపించనుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తీసే ‘భోళా శంకర్’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ‘అన్నయ్య’ చిరంజీవికి ముద్దుల చెల్లెలు. మొదట ఆ పాత్రకి సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారు మేకర్స్. కానీ సాయి పల్లవి నో చెప్పడంతో కీర్తి సురేష్ ని ఒప్పించారు. దాదాపు 2.75 కోట్ల పారితోషికం కూడా అందుకొంటోంది ఈ చిత్రంలో.

అలాగే, తమిళంలో సెల్వ రాఘవన్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె సెల్వ రాఘవన్ కి చెల్లెలుగా కనిపించనుందట. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ హీరోయిన్ గా నటిస్తూనే సిస్టర్ రోల్స్ కూడా చేస్తోందన్నమాట.

 

More

Related Stories