- Advertisement -

“యోగ చెయ్యి బాగా ఒంటికి మంచిదేగా” అన్నట్లు ఉంది కీర్తి సురేష్ మూడ్. ఈ లాక్డౌన్ టైంలో ఆమె పూర్తిగా యోగాసనాలు వేస్తూ టైం పాస్ చేస్తోంది. అంతే కాదు, యోగ వీడియోలు కూడా పోస్ట్ చేస్తోంది. కీర్తి సురేష్ ఆ మధ్య విపరీతంగా సన్నబడింది. దాంతో ఆమె శరీరాకృతిపై చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో, మళ్లీ కాస్త లావు అయింది.
కీర్తి సురేష్ ఇప్పుడు సరైన సౌష్టవంతో ఉంది. అది కాపాడుకునేందుకే ఈ యోగ.

ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. అలాగే, రజినీకాంత్ తో ‘అన్నత్థే’ సినిమాలో కూడా నటించింది. 28 ఏళ్ల ఈ సుందరి కెరియర్ కోసం పెళ్లి కూడా వాయిదా వేసుకొంది. మరో రెండేళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ పెడుతుందట.