ఐదు మిలియన్ల భామ!


కీర్తి సురేష్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే, ఇప్పటివరకు ఆమెని ఎక్కువగా ఇన్ స్టాగ్రాంలోనే ఫాలో అయ్యేవారు నెట్ జనం. ఇప్పుడు ట్విట్టర్లో కూడా ఆమెకి క్రేజ్ పెరుగుతోంది.

తాజాగా ఆమె ట్విట్టర్లో 5 మిలియన్ల (50 లక్షల) ఫాలోవర్స్ ని పొందింది. ట్విట్టర్లో ఆమె ఎక్కువగా తన సినిమాలకు సంబంధించిన ట్రయిలర్లు షేర్ చెయ్యడం, సెలబ్రిటీలకు గ్రీటింగ్లు చెప్పడం వరకు పరిమితం అవుతుంది. ఇక, ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో 13 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ అమ్మడు ఇటీవల గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో కిరాక్ పుట్టిస్తోంది. అందుకే కాబోలు ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘దసరా’ సినిమాలో నటిస్తోంది.

 

More

Related Stories