ఈమె ఓ ఎర్ర గులాబీ!

- Advertisement -
Keerthy Suresh

కొంత మంది హీరోయిన్ల అదృష్టం అలాంటిది మరి. మంచి మంచి పాత్రలన్నీ వాళ్లనే వెదుక్కుంటూ వస్తాయి. ముద్దుగుమ్మ కీర్తిసురేష్ అలాంటి అదృష్టవంతురాలే. మరీ ముఖ్యంగా “మహానటి” తర్వాత ఈమె జాతకమే మారిపోయింది. ఇప్పుడీమె చెంతకు మరో క్రేజీ ఆఫర్ వచ్చివాలింది.

దాదాపు 40 ఏళ్ల కిందట వచ్చిన “ఎర్రగులాబీలు” సినిమా ఓ సంచలనం. కమల్ హాసన్, శ్రీదేవి జంటగా భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, అప్పట్లో ఓ పాథ్ బ్రేకింగ్ మూవీ. సైకో పాత్రలో కమల్ హాసన్ చూపించిన అభినయం ఎన్నో ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు భారతీరాజా తనయుడు. ఇందులో కీర్తిసురేష్ ను తీసుకోవాలనేది ఆయన ప్లాన్.

అలనాటి “ఎర్రగులాబీలు”లో శ్రీదేవి పాత్రకు, తాజాగా భారతీరాజా తనయుడు అనుకున్న సీక్వెల్ లోని కీర్తిసురేష్ పాత్రకు పెద్దగా కనెక్షన్ ఉండదట. కాకపోతే మూవీ మొత్తం కీర్తిసురేష్ చుట్టూ తిరుగుతుందంటున్నారు. చూస్తుంటే.. కీర్తికి మరో ఛాలెంజింగ్ రోల్ దక్కినట్టే ఉంది.

 

More

Related Stories