థాయిలాండ్లో ల్యాండయిన కీర్తి


కీర్తి సురేష్ ఈ మధ్య ఎక్కువ ట్రావెలింగ్ మీద ఆసక్తి పెంచుకొంది. రకరకాల ప్రదేశాలకు టూర్లకు వెళ్లి రిలాక్స్ అవుతోంది. ఆ మధ్య దక్షిణ తమిళనాడు తిరిగింది. ఇప్పుడు థాయిలాండ్ లో ల్యాండ్ అయింది.

కీర్తి సురేష్ ప్రస్తుతం థాయిలాండ్ లోని కో సముయ్ అనే దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడే కొత్త ఏడాది వేడుకలను జరుపుకుంటుంది. క్రిస్మస్ కి ముందు రోజు అక్కడ ల్యాండ్ అయింది. జనవరి మొదటి వారంలో ఇండియాకి వస్తుందట.

ప్రస్తుతం కీర్తి సురేష్ అర్జెంట్ గా ఇండియాలో చెయ్యాల్సిన పనులు ఏమి లేవు. షూటింగ్ లు అన్ని వాయిదా పడ్డాయి. ఆమె నటిస్తున్న ‘దసరా’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది. ఇక చిరంజీవి హీరోగా రూపొందే ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ వచ్చే ఫిబ్రవరిలో మొదలవుతుంది. సో, అందుకే ఆమె టూర్లతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

మరోవైపు, ఆమె పెళ్లి గురించి ఆ మధ్య జరిగిన పుకార్లకు కూడా ఇప్పుడు బ్రేక్ పడింది.

 

More

Related Stories