కీర్తి …మరీ ఇంత స్లిమ్మా!

కీర్తిసురేష్ స్లిమ్ అయిందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె అక్కడితో ఆగలేదు. అల్ట్రా స్లిమ్ అయిపోతోంది. సైజ్ జీరో సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు జనం. తాజాగా పోస్ట్ చేసిన స్టిల్ చూసి ఆమె అభిమానులే కాదు, ప్రేక్షక లోకం కూడా నివ్వెరపోతోంది.

టీ-కాఫీ గొప్పదనం చెబుతూ ఓ పోస్ట్ వేసింది కీర్తి పాప. చేతిలో టీ పట్టుకొని ఓ సెల్ఫీ దిగింది కూడా. అయితే ఆమె ఎత్తుకున్న టాపిక్ తో సంబంధం లేకుండా, పెట్టిన ఫొటోపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది.

కీర్తిసురేష్ మరీ సన్నగా మారిపోతోందంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. పలచటి చేతులు, బక్కపల్చటి బాడీతో ఆమెలో సోయగం తగ్గిపోతోందని కొందరు వాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తగ్గే కొద్దీ కీర్తి అందం పెరుగుతోందని కామెంట్స్ పెడుతున్నారు.

ఈ చర్చ సంగతి పక్కనపెడితే.. కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిలు అమాంతం తగ్గడం ఆరోగ్యపరంగా ప్రమాదకరం. ఈ విషయంలో కీర్తిసురేష్ కాస్త జాగ్రత్తలు తీసుకుంటుందనే ఆశిద్దాం.

Related Stories