‘మహానటి’ ల్యాండ్ అయింది

Keerthy Suresh

లాక్ డౌన్ పరిస్థితుల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. రకుల్, శ్రద్ధా దాస్ లాంటి హీరోయిన్లు ఇప్పటికే సెట్స్ పైకి రాగా.. ఈ లిస్ట్ లోకి కీర్తిసురేష్ కూడా చేరబోతోంది. ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది.

కరోనా/లాక్ డౌన్ వల్ల పూర్తిగా చెన్నైలోని తన ఇంటికే పరిమితమైంది కీర్తిసురేష్. అలా 5 నెలలుగా షూటింగ్స్ కు దూరమైన ఈ ముద్దుగుమ్మ… సోమవారం నుంచి ఓ తెలుగు సినిమా సెట్స్ పైకి రాబోతోంది.

నవంబర్ నుంచి మహేష్ బాబుతో సర్కారువారి పాట సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది కీర్తిసురేష్. ఆ సినిమా షూటింగ్ ఇక్కడ కాదు.. ఏకంగా అమెరికాలో భారీ షెడ్యూల్ పెట్టుకున్నారు. సో.. ఈ గ్యాప్ లో ఆమె నితిన్ సినిమా పూర్తిచేయాలి. అందుకే ఆఘమేఘాల మీద హైదరాబాద్ లో దిగింది ఈ మహానటి

Related Stories