కీర్తి మూవీ.. నిర్మాత సేఫ్!

Keerthy Suresh

కీర్తి సురేష్ తో సినిమా నిర్మిస్తే… నిర్మాత సేఫ్ అవ్వడం గ్యారెంటీ అన్నట్లుగా తయారైంది ఓటిటి పుణ్యాన.ఈ కరోనా కష్టకాలంలో సినిమాల వ్యాపారం ఎలా ఉంటుందో తెలియక పెద్ద హీరోల సినిమా నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. కానీ, కరోనా కలం కీర్తి సినిమాల నిర్మాతలకు కలిసొచ్చింది. ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు …థియేటర్లో విడుదలైతే ఎలా ఉండేదో.

కానీ, ఇప్పుడు నిర్మాతలు సేఫ్ అవుతున్నారు. మొన్న ఆమె “పెంగ్విన్” సినిమా నిర్మాతలు ఏకంగా మంచి లాభాలు కూడా చూశారు. అందరికన్నా ముందే ధైర్యం చేసి అమ్మడంవల్ల అమెజాన్ ప్రైమ్ భారీ రేట్ ఇచ్చింది. దాంతో మూడు కోట్లు లాభం వచ్చింది నిర్మాతకు. ఇక, ఇప్పుడు “మిస్ ఇండియా” అనే ఆమె నటించిన తెలుగు సినిమా కూడా నెట్ ఫ్లిక్ సంస్థ చేతికి చిక్కుతోంది.

ఆ సినిమా నిర్మాత మహేష్ కోనేరు నెట్ ఫ్లిక్స్ తో ఇప్పటికే చర్చలు పూర్తి చేశాడట. కానీ ఇంకా ఒప్పందాలు పూర్తి కాలేదు. ఐతే, పెట్టిన పెట్టుబడి మొత్తం ఈ డీల్ ద్వారా వచ్చినట్లే. అలాగే టీవీ రైట్స్ ఎలాగు ఉన్నాయి. సో… దానివల్ల లాభమే. ఎందుకంటే… డైరెక్ట్ గా ఒటిటిలో రిలీజ్ చెయ్యడం వాళ్ళ నిర్మాతకు కోటి, రెండు కోట్లు…. పబ్లిసిటీ మీద పెట్టే ఖర్చు మిగులుతుంది.

Related Stories