కీర్తి సరసన ఆ హీరోనా!


కీర్తి సురేష్ లీడింగ్ హీరోయిన్లలో ఒకరు. ‘దసరా’ వంటి పాన్ ఇండియన్ మూవీతో త్వరలోనే మనలని పలకరించనుంది. పెద్ద సినిమాలు చేస్తోంది. నాని వంటి మెయిన్ హీరోల సరసన నటిసున్న ఈ భామ సుశాంత్ సరసన నటించేందుకు ఒప్పుకోవడం విచిత్రమే.

సుశాంత్ తక్కువని కాదు కానీ అతను ఇప్పుడు హీరో పాత్రలు పెద్దగా చెయ్యడం లేదు. పెద్ద సినిమాల్లో ‘కీలక’ పాత్రలు మాత్రమే పోషిస్తున్నాడు. మరి అలాంటి హీరోతో జతకట్టడం అంటే కీర్తి సురేష్ ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే.

కీర్తి సురేష్ కి బాయ్ ఫ్రెండ్ గా సుశాంత్ నటిస్తున్నాడు ‘భోళా శంకర్’ అనే చిత్రంలో. ఈ పాత్ర కోసం మొదట నితిన్ ని తీసుకోవాలనుకున్నారు. లేదా ఆ రేంజ్ హీరో అనుకున్నారు. కానీ నితిన్ ఎందుకనో ఒప్పుకోలేదు. దాంతో, ఆ పాత్రని సుశాంత్ కి ఇచ్చారు. అలా అతను కీర్తితో ఈ సినిమాలో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.

ఈ విషయం ఇప్పటికే తెలుగుసినిమా.కామ్ న్యూస్ ప్రచురించింది. ఈ రోజు సినిమా టీం అధికారికంగా ప్రకటించింది.

ALSO READ: Sushanth plays a lover boy in Bholaa Shankar!

ఈ సినిమాలో ఆమె మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ. సో, కీర్తి సురేష్ సరసన కాసేపు ‘లవర్’గా కనిపించే నటుడు కావాలి. ఆ ఛాన్స్ సుశాంత్ కి దక్కింది.

 

More

Related Stories