మహేష్ తో కీర్తిసురేష్ మరపురాని అనుభవాలు

తొలిసారి మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది హీరోయిన్ కీర్తిసురేష్. తనకంటూ కొన్ని జ్ఞాపకాలు పదిలపరుచుకుంది. అయితే జీవితంలో అస్సలు మరిచిపోలేని 2 అనుభూతులు మాత్రం మహేష్ తో తనకు ఉన్నాయంటోంది కీర్తి. మహేష్ ను చెంపదెబ్బ కొట్టింది అందులో ఒకటి కాగా.. రెండోది ఏంటో ఆమె మాటల్లోనే..!

“మ..మ..మహేషా సాంగ్ లో నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఆ సిగ్నేచర్ స్టెప్పులో నాకు కోర్డినేషన్ రాలేదు. 2-3 సార్లు మహేష్ ముఖంపై కొట్టాను. చాలా బ్యాడ్ అనిపించింది. నేనేమైనా తప్పు చేశానా అని మహేష్ సరదాగా అడిగారు. ఇక మరో సాంగ్ లో కూడా ఓ స్టెప్పు ఉంది. ఆ మూమెంట్ నాకు రాలేదు. నేను నా స్టయిల్ లో ఇంకేదో చేశాను. అదే మహేష్ కు నచ్చింది. నన్ను అలానే చేయమన్నారు. తను కూడా అలానే చేశారు. ఈ రెండు అనుభవాల్ని నేను మరిచిపోలేను.”

ఇలా మహేష్ తో తన వర్క్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకుంది కీర్తిసురేష్. సర్కారువారి పాట సెకెండ్ వీక్ లోకి ఎంటరైన సందర్బంగా మరోసారి ప్రమోషన్ స్టార్ట్ చేసింది యూనిట్. ఇందులో భాగంగా మహేష్, పరశురామ్ తో కలిసి చిన్న చిట్ చాట్ సెషన్ లో పాల్గొంది కీర్తిసురేష్.

ఈ సందర్భంగా ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది కీర్తి. ఇకపై తనను మహానటి అని పిలవొద్దని కోరుతోంది. మహానటి బదులు కళావతి అని పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని అంటోంది.

 

More

Related Stories