కీర్తి సురేష్ స్లిమ్ సీక్రెట్

Keerthy Suresh

ఉన్నఫలంగా కీర్తిసురేష్ ఎందుకు బరువు తగ్గింది? అసలు ఆమె టార్గెట్ ఏంటి? షార్ట్ గ్యాప్ తర్వాత  కీర్తిసురేష్ ను చూసిన చాలామంది ఇదే ఫీల్ అయ్యారు. అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఎక్కడా తను ఎందుకు స్లిమ్ అయిందనే విషయాన్ని బయటపెట్టలేదు. ఎట్టకేలకు ఓ చిన్న కారణాన్ని మాత్రం బయటపెట్టింది.

“మహానటి” టైమ్ లో కాస్త లావెక్కిందట కీర్తిసురేష్. హీరోయిన్ గా కొనసాగాలంటే బరువు తగ్గడం అత్యవసరం అని గమనించింది. అందుకే  “మహానటి” కంప్లీట్ అయిన వెంటనే కసరత్తులు ప్రారంభించిందట. అంతలోనే “మిస్ ఇండియా” అవకాశం రావడం ఆ సినిమా కోసం మరింత స్లిమ్ గా తయారవ్వడం తప్పనిసరి అని భావించి, ఇలా అమాంతం బరువు తగ్గింది ఈ బ్యూటీ.

“మిస్ ఇండియా” సినిమాలో రకరకాల దుస్తులు వేసుకోవాలని, అన్ని రకాల కాస్ట్యూమ్స్ కు తన బాడీ సెట్ అవ్వాలంటే సన్నగా మారడం ఒక్కటే మార్గమని అంటోంది కీర్తిసురేష్. ఇకపై ఆమె ఇదే వెయిట్ కంటిన్యూ చేస్తుందట.

Related Stories