అవును.. నేను జేబులు కొట్టేస్తాను

సర్కారువారి పాట ప్రమోషన్ సందర్భంగా ఓ కొత్త విషయం బయటపెట్టింది కీర్తిసురేష్. తను దొంగతనం చేస్తానని చెప్పుకొచ్చింది. కాలేజ్ డేస్ లో నాన్న పాకెట్ నుంచి డబ్బులు దొంగిలించేదాన్నని, దొంగతనం చేసే అనుభవం తనకు ఉందని చెప్పుకొచ్చింది కీర్తిసురేష్.

సర్కారువారి పాట సినిమాలో డబ్బుల కోసం మహేష్ ను మోసం చేస్తుంది కీర్తిసురేష్. ఓ పాటలో మహేష్ పాకెట్ కొట్టేస్తుంది. అదే సాంగ్ లో మరికొన్ని దొంగతనాలు కూడా చేస్తోంది. దీనిపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. నిజజీవితంలో కూడా అలాంటి దొంగతనాలు చేశారా అనేది ఆ ప్రశ్న.

7

సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి ప్రశ్నల్ని దాటవేస్తారు. అలాంటిదేం లేదని చెప్పి తప్పించుకుంటారు. కానీ కీర్తిసురేష్ మాత్రం తనకు దొంగతనం అలవాటు ఉందని చెప్పుకొచ్చింది. తండ్రి పర్సు నుంచి డబ్బులు దొంగిలించేదాన్నంటూ తన సీక్రెట్ బయటపెట్టింది.

ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది సర్కారువారి పాట. ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా క్రాస్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.

 

More

Related Stories