కీర్తికి కలిసి రావట్లేదా?

Keerthy Suresh

కీర్తి సురేష్ ఇటీవల నటించిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. లాక్ డౌన్ టైంలో ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలని డైరెక్ట్ గా ఒటిటిలో విడుదల చేసింది. రెండూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే. ఈ రెండూ బోర్ కొట్టించాయి. ఆమె నటనకి కూడా ఏమి మార్కులు పడలేదు.

ఇక ‘రంగ్ దే’తో హిట్ కొడుదామనుకుంటే అది కూడా కలిసి రాలేదు. ‘రంగ్ దే’ సినిమా ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లను పొందింది. కానీ ఆ తర్వాత పడిపోయింది. ఇప్పటి ట్రెండ్ ని బట్టి చూస్తే ఇది కూడా హిట్ అవడం కష్టమే. అంటే కీర్తి సురేష్ కి ఈ సినిమాతో కూడా లక్ కలిసి రాలేదు. కాకపోతే, గుడ్డిలో మెల్ల ఏంటంటే… ఆమె నటనకి మంచి పేరు వచ్చింది.

కీర్తి సురేష్ త్వరలోనే ఒక భారీ సినిమాతో మనలని పలకరించనుంది. అదే ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె దశ తిరగాలి. అలాగే, రజినీకాంత్ సరసన ‘అన్నత్తే’ సినిమలోనూ నటిస్తోంది.

More

Related Stories