కీర్తి బంపర్ అఫర్ కొట్టినట్లేనా?

- Advertisement -
Keerthy Suresh

కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన నటిస్తోంది. ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. అలాగే, రజినీకాంత్ సినిమాలో కూడా నయనతార, మీనాతో కలిసి ఒక హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. తాజాగా విజయ్ తో నటించే ఛాన్స్ మరోసారి వచ్చింది.

విజయ్ తదుపరి చిత్రంలో కీర్తి సురేష్ నటించనుందట. ఐతే, విజయ్ నెక్స్ట్ మూవీ లోకేష్ కనగరాజుతో ఉంటుందా? లేక వంశీ పైడిపల్లితోనా అన్నది ఇంకా తేలలేదు. ఈ ఇద్దరి దర్శకులకు విజయ్ ఓకే చెప్పారు. దర్శకుడు ఎవరైనా కీర్తి సురేష్ హీరోయిన్ అనేది టాక్. బహుశా పైడిపల్లి సినిమానే ముందు మొదలు కావొచ్చు.

కీర్తి సురేష్ ఇంతకుముందు విజయ్ సరసన ‘సర్కారు’, ‘భైరవ’ అనే సినిమాల్లో నటించింది.

 

More

Related Stories