తెలుగులో కీర్తి జోరు తగ్గిందా?

Keerthy Suresh

కీర్తి సురేష్ అద్భుతమైన నటి. జాతీయ అవార్డు కూడా అందుకొంది. నటన పరంగానే కాదు గ్లామర్ పరంగా కూడా ఇటీవల ఇతర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. కమర్షియల్ సినిమాల హీరోయిన్ గా కూడా తాను సూట్ అవుతాను అని ప్రూవ్ చేసుకొంది. కానీ ఎందుకో ఉన్నట్టుండి ఆమెకి తెలుగులో జోరు తగ్గింది.

హీరోయిన్ గా కీర్తి సురేష్ ఈ ఏడాది ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమా ఒప్పుకోలేదు. గతేడాది హీరోయిన్ గా “దసరా”, సోదరి పాత్రలో “భోళా శంకర్”లో నటించిన కీర్తి ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క మూవీ కూడా సైన్ చెయ్యలేదు. మరోవైపు, ఆమె హిందీలో ఒక వెబ్ సిరీస్, తమిళంలో నాలుగు చిత్రాలు చేస్తోంది.

తెలుగులో ఆమె తదుపరి చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ ఏడాది కూడా ఆమె పెళ్లి ఆలోచన వాయిదా వేసుకున్నట్లు సమాచారం.నటనపైనే ఫోకస్ పెడుతోంది. హిందీలో పేరు తెచుకోవాలనేది ఆమె కోరిక. తన మొదటి హిందీ ప్రాజెక్ట్ (అక్క అనే వెబ్ సిరీస్)పై మొత్తం దృష్టి పెట్టింది.

Advertisement
 

More

Related Stories