
ఇటీవల కీర్తి సురేష్ లుక్ చాలా మారిపోయింది. ‘మహానటి’ విడుదలైన తర్వాత సైజు జీరో అని చెప్పి బాడీ, ఫేసు చెడగొట్టుకొంది. అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. దాంతో రీసెంట్ గా కొంత బరువు పెరిగింది. ఆమె స్టయిల్ కూడా మారింది. లేటెస్ట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అప్ డేట్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటే.. కీర్తి కూడా గ్లామరస్ గా మారిపోయింది. స్టైలిష్ లుక్ లోకి వచ్చింది.
మరి మహేష్ బాబు సరసన నటించాలంటే ఆ మాత్రం మేకోవర్ ఉండాలి కదా. లేదంటే ‘బాబు’ అందం ముందు పూర్తిగా తేలిపోతుంది. ఆమె ఇప్పుడు మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పెద్ద సినిమా. కమర్షియల్ మూవీ. అందుకే అలా మారిపోయింది.
కీర్తి సురేష్ కి ఇటీవల అన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. ‘సర్కారు వారి పాట’తో తనని కమర్షియల్ హీరోయిన్ గా కూడా గురించాలి అనేది ఆమె ప్రయత్నం.