మహేష్, బన్నీ… ఇద్దరికీ ఓటు!

కీర్తి సురేష్ నటించిన సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే “మిస్ ఇండియా”, “పెంగ్విన్” వచ్చాయి. ఇక, నగేష్ కుకునూర్ తీసిన “గుడ్ లక్ సఖి” రిలీజ్ కి ముస్తాబవుతోంది. ఆ తర్వాత “సర్కార్ వారి పాట”లో మహేష్ బాబు సరసన నటిస్తుంది. అలాగే రజినీకాంత్ సరసన “అన్నత్థే” అనే సినిమాలో కూడా కీర్తి ఆక్ట్ చేస్తోంది. ఇటీవల ఒక బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రాపిడ్ గా చెప్పిన జవాబులు ఏంటో చూద్దాం.

మీరు నమ్మే, పాటించే మూఢ నమ్మకం?
దిష్టి తగులుతుంది అనేది నమ్ముతా. దిష్టి తీస్తాను.

మీ లైఫ్ ని మార్చిన మూవీ ఏంటి?
ఒకటి కాదు రెండు. నా మొదటి చిత్రం – “గీతాంజలి” (2013, మలయాళం). ఇంకోటి “మహానటి”.

విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్… మీ దృష్టిలో ఎవరు హ్యాండ్సమ్?
విజయ్ దేవరకొండ.

మీరు మంచి నటి లేదా మీరు బ్యూటిఫుల్ గాళ్… వీటిలో ఏ కాంప్లిమెంట్ మీకు నప్పుతుంది?
మంచి నటి.

Also Check: Keerthy Suresh Photos

బన్నీ లేదా మహేష్ బాబు… ఎవరు మీకు ఫేవరైట్?
ఒక్కరినే ఎందుకు చూజ్ చేసుకోవాలి. నా ఓటు ఇద్దరికీ.

ఒక్క మాటలో….
మహేష్ బాబు – సూపర్బ్
రజినీకాంత్ – అమేజింగ్ వ్యక్తి
చిరంజీవి – మెగాస్టార్ అంతే!

Related Stories