సర్కారు వారి పాటలో కీర్తి పాత్ర ఏంటి?

- Advertisement -
Keerthy Suresh

కీర్తి సురేష్ ఇటీవల ఎక్కువగా చీరలోనే దర్శనమిస్తోంది. చీరకట్టులోనే ఫోటోషూట్లు చేస్తూ ఇన్ స్టాగ్రామ్లో ఫోటోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా ఆమె “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తోంది. దుబాయిలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో కూడా ఆమె చీరకట్టులోనే కనిపించనుందట.

దుబాయ్ షూటింగ్ లొకేషన్ నుంచి ఆమె ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. అందులో ఆమె సారీ లుక్కులోనే దర్శనమిచ్చింది. ‘మహానటి’ సినిమా తర్వాత ఆమెకి అన్ని ఇలాంటి పాత్రలే దక్కుతున్నాయిట. అలాగే, కీర్తి సురేష్ రజినీకాంత్ సరసన ‘అన్నత్తే’లో కూడా ఇలాంటి పాత్రే పోషిస్తోంది.

ఐతే, మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్లు, సాంగులు కూడా ఉంటాయి. ఇందులో కొంత గ్లామర్ డోస్ ఉంటుంది అని అంటున్నారు.

 

More

Related Stories