అబ్బే ఆ ఆలోచనే లేదు!


కీర్తి సురేష్ త్వరలో నిర్మాతగా మారనుంది అని తెలుగుసినిమా.కామ్ సహా పలు వెబ్ సైట్లు ఇటీవల వార్తలు ప్రచురించాయి. దాంతో, ఆమె టీం ఈ వార్తలపై వివరణ ఇచింది.

“కీర్తి సురేష్ నిర్మాతగా మారడం లేదు. ఆమె ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలు కానీ వెబ్ సిరీస్ లు తీయడం కానీ చెయ్యాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం నటన తప్ప మరో ఆలోచన లేదు.” – ఇది ఆమె టీం నుంచి వచ్చిన స్పందన.

కీర్తి సురేష్ పెళ్లి గురించి, ఆమె కొత్త కెరీర్ ఆలోచనల గురించి చాలా కాలంగా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఆమె పెళ్లి వార్తలను ఇప్పటికే తోసిపుచ్చారు. ఇప్పుడు నిర్మాత కాబోతున్నట్లు సాగుతున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది.

కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘దసరా’ సినిమాలో నటిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా ‘భోళా శంకర్’లో చేస్తోంది. ఈ రెండు సినిమాలు వచ్చే వేసవిలో విడుదల అవుతాయి.

 

More

Related Stories