వైవిధ్యం ఇష్టం: కేతిక శర్మ

Ketika Sharma

ఇటీవలే ‘రొమాంటిక్’ సినిమాలో నటించింది కేతిక శర్మ. ఆమె రెండో తెలుగు చిత్రం…. ‘లక్ష్య’ డిసెంబర్ 10న విడుదల కానుంది. నాగశౌర్య హీరో ఇందులో. నాగశౌర్యకి లవర్ గా నటించింది కేతిక.

“రొమాంటిక్ చిత్రంలో చేసిన పాత్ర, లక్ష్య సినిమాలో చేసిన పాత్రకి పోలికే ఉండదు. ఇందులో రితిక అనే అమ్మాయి పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో కనిపిస్తాను. నాగ శౌర్య డెడికేషన్ చూసి చాలా నేర్చుకున్నాను,” అని ఈ సినిమా విశేషాలు వివరించింది కేతిక.

ఈ అమ్మడు కూడా స్పోర్ట్స్ విమెన్. రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొందట. అంతే కాదు ఆమె మంచి సింగర్. ఇక తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోందిట.

“ప్రస్తుతం నా మూడో ప్రాజెక్ట్ వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్నాను. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని భాషల్లో నటించాలని ఉంది. హీరోయిన్ కావాలనేది నా కల. అది పూర్తి అయింది. ఇక నటిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తా,” అని చెప్తోంది కేతిక.

 

More

Related Stories