‘రొమాంటిక్’ హీరోయిన్ పరిస్థితేంటి?

- Advertisement -
Ketika Stills 11062100001

కేతిక శర్మ… ‘రొమాంటిక్’ అనే సినిమాలో అందాలన్నీ ఆరబోసింది. అదే ఆమెకి మొదటి సినిమా. పూరి జగన్నాధ్ కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదల అయింది. ఆమె సోకుల షో ఆ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమా చూసిన వారంతా ఈ భామకు అవకాశాలు వెల్లువలా వస్తాయని అన్నారు. అలాగే ఉంది ఆమె అందాల ప్రదర్శన.

ఐతే, ‘రొమాంటిక్’ సినిమా పరాజయం పాలు కావడంతో ఆమె వేసుకున్న అంచనాలు తప్పాయి. ఆమె రెండో చిత్రం… నాగశౌర్య నటించిన ‘లక్ష్య’. ఇది కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఆడితే ఆమెకి క్రేజ్ పెరుగుతుందేమో. మొదటి సినిమాతోనే ‘ఉప్పెన’ భామలా క్రేజ్ తెచ్చుకోవాలన్న ఆశలు మాత్రం నిజం కాలేదు.

రెండో సినిమా రిలీజ్ కి ముందే మరికొన్ని సినిమాలు కమిట్ అయింది. వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో ఒక మూవీ స్టార్ట్ అయింది. ఇందులో ఏది ఆడినా ఆమె కెరీర్ కి మంచి ఊపు వస్తుంది.

Ketika Sharma

ముంబైకి చెందిన కేతిక పలు టీవీ యాడ్స్ లో నటించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకి ఫోలోయింగ్ చాలా ఎక్కువ

More

Related Stories