
కేతిక శర్మ అందచందాల ప్రదర్శనకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు అట్లుంటాయి మరి. గ్లామర్ పరంగా అంత క్రేజ్ ఉంది భామకి. అందుకే ఇప్పటికే నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఒక్కటీ ఆడలేదు. ఆమెకి అదృష్టం వరించడం లేదు.
కేతిక శర్మ తాజాగా “బ్రో” సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్ద చిత్రం. ఈ మూవీతోనైనా సక్సెస్ బాట పట్టాలని ఆశపడింది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో హిట్ ఐతే తనకి బాగా గుర్తింపు వస్తుందని అనుకొంది. కానీ “బ్రో” పెద్దగా ఆడలేదు. ఆమె పాత్రకు పేరు రాలేదు.
“బ్రో” సినిమాలో ఆమె సాయి ధరమ్ తేజ్ కి గాళ్ ఫ్రెండ్ గా నటించింది. వీరి మధ్య ఒక పాట కూడా ఉంది. కానీ సినిమా హిట్ కాకపోవడంతో ఆమె ఆశలు నెరవేరలేదు.
2021లో విడుదలైన “రొమాంటిక్” చిత్రంతో అడుగుపెట్టింది. పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి సరసన ఆ చిత్రంలో నటించింది. ఆ తర్వాత నాగ శౌర్య సరసన “లక్ష్య”, వైష్ణవి తేజ్ సరసన “రంగ రంగ వైభవంగా” చిత్రాలు చేసింది. ఆమె కెరీర్లో నాలుగో చిత్రం… బ్రో. నాలుగింటిలో ఒక్కటీ హిట్ అనిపించుకోలేదు.

ఆమెకి ఫస్ట్ హిట్ ఎప్పుడు వస్తుందో మరి.