KGF2కి పోటీగా లాల్ సింగ్ చద్దా


అమీర్ ఖాన్ నటించిన భారీ బాలీవుడ్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ మరోసారి వాయిదాపడింది. దాదాపు మూడేళ్ళుగా నిర్మాణంలో ఉన్న ఈ మూవీ క్రిస్మస్ 2021 నుంచి ఫిబ్రవరి 2022కి మారింది. ఇప్పుడు మళ్ళీ విడుదల తేదీని మార్చేశారు. ఈ సినిమాకి కొత్త డేట్.. ఏప్రిల్ 14, 2022.

“KGF 2” సినిమా అదే తేదీన విడుదల కానుంది. ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని కెజిఫ్ మేకర్స్ ఇప్పటికే చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు కూడా డేట్ మారుస్తారా? లాల్ సింగ్ చద్దాతో పోటీపడుతారా అన్నది చూడాలి.

అన్నట్లు, ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతోనే నాగ చైతన్య బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య బాల అనే ఆంధ్ర కుర్రాడిగా నటించారు. అమీర్ ఖాన్ తో కలిసి కార్గిల్ యుద్ధంలో పాల్గొని వీర మరణం పొందే సైనికుడి పాత్ర పోషించారు నాగ చైతన్య.

హాలీవుడ్ లో క్లాసిక్ గా గుర్తింపు పొందిన ‘ఫారెస్ట్ గంప్’ సినిమాకి ఇది రీమేక్. అమీర్ ఖాన్ ఒక స్వాతిముత్యం (మందబుద్ధి)లా కనిపిస్తారు. కరీనా కపూర్ అతని ప్రియురాలుగా నటించింది.

Advertisement
 

More

Related Stories