కేజీఎఫ్ 3 … ప్రామిస్ గా వస్తుంది!

Yash

సరిగ్గా ఏడాది క్రితం విడుదలైంది KGF 2. ఏప్రిల్ 14, 2022న విడుదలై దేశమంతా సంచలనం సృష్టించింది. గతేడాది ఇండియాలో అతిపెద్ద హిట్ మూవీ… కేజీఎఫ్ 2.

ఏడాది తర్వాత కూడా ఆ సినిమా హీరో యష్ కూడా మరో సినిమా గురించి ప్రకటన చెయ్యలేదు. ఏడాదిగా ఖాళీగా కూర్చుంటున్నాడు. ఆయన మనసులో ఏముందో అర్థం కావడం లేదు అంటున్నారు ఆయన అభిమానులు. ఈ రోజు (ఏప్రిల్ 14) ఎదో ఒక ప్రకటన చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ, ఆయన తన తదుపరి చిత్రం గురించి ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

‘కేజీఎఫ్ 2’ నిర్మాతలు మాత్రం ఒక కొత్త వీడియో విడుదల చేశారు. “కేజీఎఫ్ 3” ఉండబోతుంది అన్నట్లుగా హిట్ ఇచ్చారు. “ప్రామిస్ చేశాం. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటాం. పార్ట్ 3 వస్తుంది,” అని ఈ కొత్త వీడియోలో చెప్పారు. ‘కేజీఎఫ్’ కథలో రాఖీ భాయ్ 1978 నుంచి 1981 వరకు ఎవరికీ కనిపించకుండా వెళ్తాడు. ఆ టైంలో రాఖీ భాయి ఏమి చేశాడో మూడో భాగంలో చూపిస్తారంట.

ఐతే, ఏది ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమా తీస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మూవీ తీస్తారు. ఇంకో రెండేళ్లు ఆయన తెలుగులోనే బిజీ. సో, రెండు, మూడేళ్ళ వరకు ‘కేజీఎఫ్ 3’ ప్రస్తావన ఉండదు.

ఇక యష్ కి సరైన దర్శకుడు, సరైన కథ దొరకడం లేదు. అందుకే… ఏడాది తర్వాత కూడా బ్లాంక్ స్పేస్ లోనే ఉన్నారు యష్.

 

More

Related Stories