100 మిలియన్లు కూడా దాటేసింది

KGF Teaser 2

‘కేజిఎఫ్ 2’ సినిమా టీజర్ సంచలనం ఆగట్లేదు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ పొందింది. 24 గంటల్లో 70 మిలియన్ల వ్యూస్ లాగేసి ఒక రికార్డ్ క్రియేట్ చేయగా ఇప్పుడు సెంచురి కూడా కొట్టింది.

చూస్తుంటే, ఈ సినిమాకి కూడా ‘బాహుబలి 2’కి వచ్చిన క్రేజ్, బజ్ కనిపిస్తోంది. సో.. సమ్మర్ రేస్ లో దిగనున్న ఈ మూవీ మరో “బాహుబలి 2″లా కలెక్షన్లు పొందుతుందా? కరోనా తర్వాత థియేటర్లలో ఆ రేంజు కలెక్షన్లను రాబట్టే సత్తా సినిమాలకు ఉందా? అనేది చూడాలి. ప్రస్తుతానికి టీజర్ తో మాత్రం ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా హీరో యష్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఈ వ్యూస్ గురించి, టీజర్ రికార్లుల గురించి తెగ ప్రోమోట్ చేస్తున్నాడు.

More

Related Stories