తెలంగాణాలో ఆ రికార్డు

- Advertisement -
KGF 2

తెలుగునాట డబ్బింగ్ చిత్రాలు సంచలన విజయాలు సాధించడం కొత్తేమి కాదు. ఏళ్లుగా ఉంది ఈ ట్రెండ్. ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలు తెలుగు పెద్ద హీరోల చిత్రాలకు సమానంగా ఆడేవి. ఇప్పుడు రజినీకాంత్ హవా తగ్గింది. ఐతే, కన్నడ హీరో యష్ నటించిన ‘కేజీ ఎఫ్ 2’ మాత్రం రజినీకాంత్ సినిమాలని మించి పోయింది.

తెలంగాణాలో (నైజామ్) ఈ సినిమా 30 కోట్ల మార్కుని దాటింది. ఐదు రోజుల్లో 30 కోట్ల రూపాయల షేర్ అందుకొంది కేజీఎఫ్ 2. ఇది డబ్బింగ్ చిత్రాల్లో ఆల్ టైం రికార్డు. ఇంతవరకు ఏ డబ్బింగ్ చిత్రం కూడా పాతిక కోట్ల వసూళ్ళని అందుకోలేదు తెలంగాణాలో. ఇది ఏకంగా ఐదు రోజుల్లోనే 30 కోట్ల రూపాయల వసూళ్లు పొందింది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన “కేజీఎఫ్” మొదటి భాగం విజయవంతమైంది. దాంతో, రెండో భాగానికి బాగా క్రేజ్ వచ్చింది. దానికి తగ్గలే వసూళ్లు ఉన్నాయి. ఇంతకుముందు రజినీకాంత్ నటించిన ‘2.0’ సినిమా తెలంగాణలో 23 కోట్ల వసూళ్లు అందుకొంది. దాదాపు 50 రోజుల పాటు ఆడి 23 కోట్లు కొల్లగొట్టంది ఆ చిత్రం. “కేజీఎఫ్ 2” 5 రోజుల్లో 30 కోట్లు రాబట్టింది.

సినిమా రన్ మొత్తం ముగిసేసరికి ఇంకా ఎంత వసూళ్లు పొందుతుందో?

ఏది ఏమైనా, ” “కేజీఎఫ్ 2” ఒక చరిత్ర సృష్టించింది. రాబోయే డబ్బింగ్ చిత్రాలన్నిటికి ఇది ఒక బెంచ్ మార్క్ కానుంది.

 

More

Related Stories