- Advertisement -

‘KGF చాప్టర్ 2’ షూటింగ్ ముగిసింది. ఈ సినిమా షూటింగ్ కి ఆదివారం హైద్రాబాద్లో గుమ్మడికాయ కొట్టారు. హైద్రాబాద్లోనే భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేశారు.
ఇక విడుదల తేదీ, టీజర్ డేట్, ట్రైలర్ లాంచ్ వంటివి ప్రకటిస్తారు. ఈ సినిమా హీరో యాష్ బర్త్ డే …జనవరి 8. సో..అతని పుట్టిన రోజుని పురస్కరించుకొని మూవీ టీజర్ రిలీజ్ చెయ్యాలని టీమ్ ఫిక్స్ అయింది. సినిమాని వేసవి సెలవుల్లో రిలీజ్ చేస్తారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్ హీరోగా “సలార్” సినిమా ప్రకటించాడు. జనవరిలోనే షూటింగ్ మొదలు పెట్టాలనేది ప్లాన్. మరి జనవరి లో షూటింగ్ స్టార్ట్ చేస్తే… ‘KGF చాప్టర్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ ఎవరు చూస్తారు అనేది చూడాలి.