
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో ఇంతకుముందు “నాయకుడు” చిత్రం వచ్చింది. టైం మేగజైన్ ఆ మధ్య ప్రకటించిన ప్రపంచ ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. అలాంటి క్లాసిక్ తీసిన కాంబినేషన్ వీరిది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కమల్, మణిరత్నం చేతులు కలిపారు. ఈ కొత్త సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే కాన్సెప్ట్ టీజర్ ని చిత్రీకరించారట. ఆ టీజర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
నవంబర్ 7న కమల్ హాసన్ బర్త్ డే. ఆ రోజు ఈ టీజర్ ని విడుదల చేసి సినిమాపై హైప్ తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మణిరత్నం “పొన్నియన్ సెల్వన్” చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాతో ఆయన కోట్లకొద్దీ లాభాలు చూశారు. ఇప్పుడు కమల్ హాసన్ కూడా “విక్రమ్” సినిమా తర్వాత మంచి ఊపులో ఉన్నారు. ఈ కాంబినేషన్ కి మంచి బిజినెస్ అవుతుంది.
అందుకే, ముందు నుంచే ఈ సినిమాకి హైప్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.