‘ఆహా’ అనిపించిన ఖైలాష్ ఖేర్

Khailesh Kher

హై పిచ్ పాటలకు పెట్టింది పేరు… ఖైలాష్ ఖేర్. తన గాత్రమధురిమతో తెలుగులో కూడా తన ఆయన ఎన్నో పాటలను పాపులర్ చేశారు. ఈ అగ్ర గాయకుడు పాడిన తాజా తెలుగు పాట … “ఆహా”.

“పుష్పక విమానం” అనే సినిమాలో ఆయన ఈ పాట పాడారు. సిద్ధార్థ్ సదాశివుని అనే కొత్త సంగీత దర్శకుడు స్వరపరిచిన ఈ సాంగ్ ని ఆయన తన శైలికి భిన్నంగా పాడడం విశేషం. ఈ సినిమా కథలో హీరో భార్య ‘లేచిపోతుంది’. ఆ కాన్సెప్ట్ తో సాగిన సాంగ్ ఇది.

“పుష్పక విమానం” ట్రైలర్ కి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఈ పాట కూడా ఫన్నీగా ఉంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం తెగ ప్రొమోషన్ చేస్తున్నారు.

#Aaha Lyrical Song |Pushpaka Vimanam Songs |Anand Deverakonda, GeethSaini, Saanve Megghana |Damodara
 

More

Related Stories