ఖిలాడి హిందీలో తుస్సు

- Advertisement -
Khiladi


ఊహించిందే జరిగింది. రవితేజ నటించిన ‘ఖిలాడి’కి హిందీలో ఎటువంటి స్పందన దక్కలేదు. రవితేజ సినిమాలను హిందీ మార్కెట్ లో యూట్యూబ్ లో, హిందీ ఛానెలల్లో ఎగబడి చూస్తారనేది నిజం. ఒక్క హిందీ డబ్బింగ్ రైట్స్ తోనే రవితేజ సినిమాల నిర్మాతలకు 25 కోట్ల వరకు వస్తాయి.

ఐతే, హిందీ డబ్బింగ్ సినిమాల మార్కెట్ లో రవితేజకి క్రేజున్నా… థియేటర్లలో ఆయన సినిమాలు చూసేందుకు ఇంకా హిందీ ప్రేక్షకులు రెడీగా లేరు అనిపిస్తోంది. ‘పుష్ప’ హిందీలో సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ప్రతి తెలుగు సినిమా హిందీలో థియేటర్లలో విడుదలకి రెడీ అవుతున్నాయి. అలా ‘ఖిలాడి’ కూడ తెలుగుతో పాటు గతవారం విడుదలైంది.

మొదటివారం, ‘ఖిలాడి’కి హిందీ మార్కెట్ లో వచ్చిన కలెక్షన్లు చూస్తే … వాటి వాళ్ళ పోస్టర్ ఖర్చులు కూడా రావని చెప్పొచ్చు. రిలీజ్ అయిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు కాబోలు. ఆల్మోస్ట్ నిల్ కలెక్షన్లు అని చెప్పాలి.

పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ తెలుగు హీరోలు, దర్శక నిర్మాతలు తెగ హంగామా చేస్తున్నారు. కానీ, ‘పుష్ప’కి, ‘కేజీఎఫ్’కి వర్కౌట్ అయింది కదా అని అన్నిటికి సాధ్యం అవుతుంది అనుకుంటే పొరపాటే. ‘ఖిలాడి’కి వచ్చిన నిల్ ఓపెనింగ్స్ నిదర్శనం.

 

More

Related Stories