ఖిలాడికి కొత్త డేట్ వస్తుందా?


రవితేజ నటించిన ‘ఖిలాడి’ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. గతేడాది మేలో విడుదల కావాల్సిన ఈ మూవీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఫిబ్రవరి 11, 2022న విడుదల చెయ్యాలని రెండు నెలల క్రితం ప్లాన్ చేశారు. అదే విధంగా ప్రొమోషన్ చేస్తున్నారు.

ఈ నెల 26న రవితేజ పుట్టిన రోజు. ఆ రోజు ఈ సినిమా నుంచి నాలుగో పాట కూడా రానుంది. పాటల ప్రొమోషన్ కంటిన్యూ చేస్తున్నా సినిమా విడుదల అవుతుందా అనేది సందేహం. కరోనా కేసుల కారణంగా అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. రవితేజ డేర్ చేసి విడుదల చేస్తే సమస్య ఉండదు. నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాని సంక్రాంతికి అలాగే విడుదల చేసి కాస్త గట్టెక్కారు.

కానీ, ఫిబ్రవరిలో కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది అనేది అంచనా. అదే జరిగితే, ఈ సినిమాని వాయిదా వెయ్యక తప్పదు. సో, ‘ఖిలాడి’కి కొత్త డేట్ ప్రకటించక తప్పదు.

రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కరోనా వేవ్ మొదలు కాకముందు మొదలైంది. మూడో వేవ్ వస్తున్నా ఇంకా రిలీజ్ కి కష్టాలు పడుతోంది.

 

More

Related Stories