ఖుష్బూకు బెదిరింపులు

- Advertisement -
Khusbu Sundar

సీనియర్ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూను ఓ అగంతకుడు బెదిరించాడు. ఎందుకు బెదిరించాడనే విషయాల్ని ఆమె బయటపెట్టలేదు కానీ రేప్ చేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగుతున్నాడని ప్రకటించింది ఖుష్బూ.

తనను బెదిరించిన వ్యక్తి ఫోన్ నంబర్ ను ఆమె బయటపెట్టింది. అంతేకాదు.. ట్రూ కాలర్ యాప్ లో ఆ నంబర్ సెర్ట్ చేసి, అతడి పేరును కూడా బయటపెట్టింది. అతడి పేరు సంజయ్ శర్మ. కోల్ కతా నుంచి కాల్ చేస్తున్నాని తెలిపిన ఖుష్బూ.. ఆ వివరాలతో కోల్ కతా పోలీసులను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసింది.

అక్కడితో ఆమె ఆగలేదు. తను ఫిర్యాదు చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ఆమె మరో ఫిర్యాదు చేశారు. తన లాంటి వ్యక్తికే ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయంటే, ఇక సామాన్య మహిళల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు ఖుష్బూ.

 

More

Related Stories