తండ్రి వేధించాడంటున్న ఖుష్బూ


ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిన ఖుష్బూ ఇప్పుడు రాజకీయనాయకురాలిగా బిజీగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న ఆమె ఇప్పుడు బీజేపీ నాయకురాలు. ఆమె సేవలు మెచ్చి ఇటీవలే కేంద్ర ప్రభుతం ఆమెని జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా నియమించారు.

మహిళా దినోత్సవం (మార్చి 8) వస్తున్న సందర్భంగా ఆమె కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపాయి. తనని తన తండ్రి లైంగికంగా వేధించాడని చెప్పింది.

“ఎనిమిదేళ్ల వ‌య‌సులోనే నేను లైంగిక వేధింపులు చూశా. నా తండ్రే నన్ను వేధించాడు,” అని ఆమె వివరించింది. “భార్యాబిడ్ద‌ల్ని వేధించ‌డం జ‌న్మ హ‌క్కుగా భావించే వాడు ఆయన.. న‌న్నూ, మా అమ్మ‌ని వ‌దిలేసి వెళ్ళిపోయాడు. టీనేజ్ నుంచే రెబెల్, ” అని కూడా చెప్పింది.

ఆమెకి ఇద్దరు కూతుళ్లు. ఆమె భర్త తమిళ దర్శకుడు సుందర్. ఐతే, నా కూతుళ్లకు, తన తల్లికి ఈ విషయం తెలుసు అని, కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం లేదని చెప్తోంది. ప్రతి అమ్మాయి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని అంటోంది ఖుష్బూ.

 

More

Related Stories