యాక్టింగ్ స్కూల్లో చేరిన శ్రీదేవి కూతురు

శ్రీదేవి కూతురు జాన్వీ ఇప్పటికే హీరోయిన్ గా సెటిల్ అయింది. కోట్లు సంపాదిస్తోంది. జాన్వీ మంచి అందెగత్తెగా గుర్తింపు తెచ్చుకొంది. ఇప్పుడు చిన్న కూతురు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. జాన్వీ పెద్ద అమ్మాయి. చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా అక్క బాటలోనే నటిగా అరంగేట్రం చేయనుంది. నటన నేర్చుకునేందుకు ఖుషి అమెరికా వెళ్ళింది. న్యూయార్క్ లోని ఫేమస్ లీ స్ట్రాస్బెర్గ్ ఇనిస్టిట్యూట్ లో చేరింది. ఏడాది కోర్సు పూర్తి ఐన తర్వాత సినిమాల్లో నటిస్తుందట.

2022లో యాక్టింగ్ డెబ్యూ ఉంటుంది అని ఖుషీ చెప్తోంది.జాన్వీ కపూర్ ని కరణ్ జోహార్ హీరోయిన్ గా లాంచ్ చేశాడు. మరి చెల్లెల్ని కూడా అతనే లాంచ్ చేస్తాడా అన్నది చూడాలి. బోనీ కపూర్ తన కూతుళ్లతో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపడం లేదు. వేరే ప్రొడక్షన్ లో వాళ్ళు స్టార్స్ గా నిలబడితేనే పేరు వస్తుంది అనేది ఆయన అభిప్రాయం.

More

Related Stories