జాన్వీని మించిపోతున్న ఖుషి

Kushi Kapoor

శ్రీదేవి కూతురుగా మొదట పేరు తెచ్చుకున్నది జాన్వీ కపూర్. కానీ, ఆమె సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్నది మాత్రం సొంతంగానే. నిత్యం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తక్కువ టైంలో గ్లామర్ గల్ ఇమేజ్ పొంది, మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ని పొందింది జాన్వీ. జాన్వీ కపూర్ తన సినిమాలతో కన్నా ఈ ఫోటోలు, ఇన్ స్టాగ్రామ్ పోస్టులతోనే ఎక్కువ పాపులర్ అయిందనేది నిజం. ఇప్పుడు ఆమె సోదరి కూడా అదే బాటలో వెళ్తోంది.

శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కూడా ఇన్ స్టాగ్రామ్ స్టార్ అయిపొయింది. ఆమె నటిస్తోన్న మొదటి చిత్రం ఇంకా సెట్స్ పైనే ఉంది. కానీ అప్పుడే ఆమెకి 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆమె పెట్టె ఫోటోలు అలాంటివి. తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇంకా ఎక్కువగా కాక రేపుతున్నాయి.

అట్లుంటది మరి శ్రీదేవి కూతుళ్లతో.

ఖుషి కపూర్ నటిస్తున్న మొదటి చిత్రం… ఆర్చీస్. నెట్ ఫ్లిక్స్ కోసం ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ తీస్తున్న యూత్ ఫుల్ డ్రామా ఇది. ఇందులో అమితాబ్ బచ్చన్ మనవడు, షారుక్ కూతురు కూడా నటిస్తున్నారు. ఖుషి కపూర్ కూడా అక్కలాగే తొందర్లోనే క్రేజ్ తెచ్చుకునేలా ఉంది.

 

More

Related Stories