కియరాకి మరో బంపర్ ఆఫర్!


కియరా అద్వానీ గ్రాఫ్ పెరుగుతోంది. పెద్ద సినిమాలన్నీ తన ఖాతాలో వేసుకుంటోంది. బాలీవుడ్ లో దీపిక పదుకొనెకి ఉన్న క్రేజ్ వేరు. కానీ, ఆమె యువ హీరోల సరసన అంతగా నప్పుదు. ఇక అలియా భట్ గర్భవతి. ఆమె ఇప్పట్లో సినిమాలు చెయ్యదు. కత్రినకి క్రేజ్ పోయింది. సో, ఉన్న యువ హీరోయిన్లలో కృతి సనన్, కియరా అద్వానీలకే పెద్ద ప్రాజెక్టులు ఇస్తున్నారు.

మొన్నటివరకు దీపిక, అలియా భట్ తో సినిమాలు చేసిన బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ భన్సాలీ ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని కియరాతో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కియరాతో ఆయన ముచ్చట్లు కలిపారు. ఇటీవల ఆమె భన్సాలీ ఆఫీసుకు తరచుగా వెళ్లి వస్తుంది. ఐతే, భన్సాలీ సినిమా సైన్ చేసేముందు చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆయన ఒక ఫోటోషూట్ చేస్తారు. ఆడిషన్ చేస్తారు. అందులో పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆయన హీరోయిన్ ని అడ్వాన్స్ ఇస్తారు.

అందుకే, కియరా ఇప్పుడు భన్సాలీ నుంచి అడ్వాన్స్ అమౌంట్ రావాలని కోరుకుంటోంది. ఈ సినిమా సైన్ చేస్తే ఆమె మరో సినిమా చెయ్యలేదు. పూర్తిగా ఆ సినిమాకే అంకితం అవ్వాలి. దానికి తోడు ఆమెకి తెలుగులో శంకర్ తీస్తున్న భారీ చిత్రం కూడా ఉంది.

కియరా అద్వానీకి మంచి సక్సెస్ రేట్ ఉంది. కుర్రకారులో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే, పెద్ద దర్శకులు ఆమె వెంట పడుతున్నారు.

ఆమె సినిమాకి 4 కోట్ల రూపాయిల పారితోషికం తీసుకుంటుంది. దీపిక, అలియా భట్ తర్వాత ఎక్కువ సంపాదించే భామ.

 

More

Related Stories