
కియారా అద్వానీ బాలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్. ఆమె తెలుగులో మొదటిసారిగా “భరత్ అనే నేను”లో నటించినప్పుడు 80 లక్షలు తీసుకొంది. “వినయ విధేయ రామ”కి కోటిన్నర అందుకొంది. కానీ ఇప్పుడు ఆమె రేంజ్ వేరు. బాలీవుడ్ లోనే యమా బిజీగా ఉంది. అక్కడే 4 కోట్ల రూపాయలు తీసుకుంటోంది మరి అలాంటప్పుడు తెలుగులో నటించాలంటే తక్కువకి చెయ్యదు కదా. తెలుగులో నటించాలన్న 4 కోట్లు తక్కువకి కోట్ చెయ్యడం లేదు.
రామ్ చరణ్ – శంకర్ తీస్తున్న సినిమాకి ఈ భామ నాలుగున్నర కోట్లకు ఒప్పుకొంది. ఇది తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రం కాబట్టి 5 కోట్లు అడిగింది. ఫైనల్ గా నాలుగున్నరకి ఒప్పుకొందట. శంకర్ ఆలోచన ప్రకారం దిల్ రాజ్ ఈ సినిమా విషయంలో ఖర్చు పెడుతున్నారు.
కియారా అద్వానీని ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకి కూడా అడిగారు కానీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు చరణ్ – శంకర్ సినిమాకి ఆమె ఒప్పుకొంది కాబట్టి మరో బడా హీరోయిన్ వైపు చూపు వేసే అవకాశం ఉంది.
కియారా ప్రస్తుతం బాలీవుడ్ లో తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక మూవీ చేసింది. అది ఈ నెలలోనే డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల కానుంది.