
కియరా అద్వానీ…..జాన్వీ కపూర్… మృణాల్ ఠాకూర్….
ఈ ముగ్గురు భామల మధ్య కాంపిటీషన్ పెరిగింది. ముగ్గురూ మంచి ఫామ్ లో ఉన్నారు. ముగ్గురూ అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నారు.
బాలీవుడ్ లో ఉన్న మిగతా హీరోయిన్లకు, వీరికి తేడా ఏంటంటే వీరికి తెలుగులో పెద్ద పెద్ద ఆఫర్లు ఉన్నాయి. ఇలా రెండు పరిశ్రమల్లో క్రేజ్ ఉంది కాబట్టి ఈ ముగ్గురు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.
కియరా అద్వానీ
కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన “గేమ్ ఛేంజర్” సినిమాలో నటిస్తోంది. ఇది పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల అవుతుంది. ఇక హిందీలో ఈ భామ ఇటీవలే “డాన్ 3″లో హీరోయిన్ గా ఎంపిక అయింది. రణ్వీర్ సింగ్ సరసన నటించనుంది.
32 ఏళ్ల ఈ భామ మరో పెద్ద సినిమా కూడా లాగేసుకొంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందే “వార్ 2″లో కియారా మెయిన్ హీరోయిన్. సో, ఆమె ఖాతాలో మూడు బిగ్ మూవీస్ ఉన్నాయిప్పుడు.

జాన్వీ కపూర్
నిజానికి జాన్వీ కపూర్ కి బాలీవుడ్ చిత్రసీమలో పెద్ద హిట్స్ లేవు. ఆమె మొదటి చిత్రం “ధడక్”తో పాటు “మిలి” అనే మరో సినిమా మాత్రమే థియేటర్లో విడుదలైంది. మొత్తంగా ఆమె ఏడు హిందీ చిత్రాల్లో నటిస్తే అయిదు చిత్రాలు డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల అయ్యాయి. రెండు థియేటర్లోకి వచ్చాయి. సో ఆమెకి థియేటర్లో భారీ హిట్ లేదు ఇప్పటివరకు.
ఐతే, ఆమెకి క్రేజ్ మాత్రం బాగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన “దేవర” చిత్రంలో నటిస్తోంది. లేటెస్ట్ గా రామ్ చరణ్ సరసన కొత్త సినిమా ఒప్పుకొంది. ఇక తమిళ హీరో సూర్య సరసన “కర్ణ” చిత్రంలో కూడా ఈ భామ నటిస్తోంది. ఈ మూడు భారీ చిత్రాలే. ఆ విధంగా జాన్వీ తెగ క్రేజ్ తెచ్చుకొంది.

మృణాల్ ఠాకూర్
ఇక మృణాల్ ఠాకూర్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ భామ ఇప్పటికే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ వంటి పెద్ద హీరోల సరసన నటించింది. కానీ ఆమెకి హిందీలో భారీ సక్సెస్ రాలేదు. మృణాల్ కి తెలుగులో నటించిన తర్వాతే క్రేజ్ పెరిగింది. ఈ 31 ఏళ్ల భామ తెలుగులో నటించిన మొదటి చిత్రం… సీతారామం. అది పెద్ద హిట్.
దాంతో, ఆమె హీరోయిన్ గా నాని సరసన రెండో చిత్రం కొట్టేసింది. “హాయ్ నాన్న”లో నటించింది. మూడో చిత్రం… విజయ్ దేవరకొండ సరసన “ఫ్యామిలీ స్టార్”. ఇక తమిళంలో మరో పెద్ద సినిమా చర్చల దశలో ఉంది.

హిందీలో “పూజ మేరీ జాన్” అనే సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ భామ 10 కోట్లు పెట్టి ముంబైలో రెండు అపార్టుమెంట్లు కొన్నది. దీని బట్టి చెప్పొచ్చు ఈ భామకి ఎలా క్రేజ్ ఉందో!