ఎప్పుడూ ఛీటింగే: కియారా

- Advertisement -
Kiara Advani

పండగలు వచ్చాయంటే హీరోయిన్లకు తెగ ఇబ్బంది. రోజూ జిమ్ చేస్తూ తమ శరీరాకృతిని కాపాడుకునే హీరోయిన్లు.. ఫెస్టివల్స్ టైమ్ లో స్వీట్స్ తింటే బరువు పెరగడం, షేప్ అవుట్ అవ్వడం గ్యారెంటీ. ఇలాంటి సమస్యలు తనకు కూడా ఉన్నాయంటోంది హీరోయిన్ కియరా అద్వానీ.

మోడలింగ్ లో ఉన్నప్పట్నుంచి పండగలకు స్వీట్స్ తినే విషయంలో కాస్త స్ట్రిక్ట్ గా ఉన్నానంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమధ్య కాలంలో దానికి ప్రత్యామ్నాయం కనిబెట్టినట్టు చెప్పుకొచ్చింది. ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువగా ఫిజిక్ పై ప్రభావం చూపని కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే స్వీట్స్ తింటున్నట్టు తెలిపింది.

వీకెండ్స్ లో ఎలాగైతే ఛీట్ మీల్ ఉంటుందో.. ఇది కూడా అలాంటి ఛీటింగ్ అంటోంది కియరా.

ఇక ఈ ఏడాది దీపావళి విషయానికొస్తే.. ఈసారి షూటింగ్ కోసం చంఢీగడ్ వెళ్లింది కియరా.

 

More

Related Stories