బాయ్ ఫ్రెండ్ ఇంటికీ షిఫ్ట్

Kiara Advani

బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా అద్వానీ లవ్ లో ఉందనేది తెలిసిన మ్యాటరే. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఇద్దరూ ఇక సహజీవనం చెయ్యాలని డిసైడ్ అయ్యారట. లేటెస్ట్ గా ఈ భామ సిద్ధార్థ్ ఇంటికి మూవ్ అయిపోయింది అని బాలీవుడ్ మీడియా మాట. అంటే కియారా, సిద్ధార్థ్ ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.

సిద్ధార్థ్ మంచి అందగాడు. మొదట్లో అలియా భట్ తో డేటింగ్ చేశాడు. కానీ, అలియా అతనికి డిచ్ కొట్టి రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత సిద్ధార్థ్ కెరీర్ కొంత ఒడిదొడుకులకు లోను అయింది. ఇప్పుడు కెరీర్ పుంజుకుంటోంది. గతేడాది సిద్ధార్థ్, ఆలియా జంటగా ఒక సినిమాలో నటించారు. ఆ షూటింగ్ టైంలో ఒకటయ్యారు. ఇప్పుడు డీప్ లవ్వులో ఉన్నారట.

కియారా కూడా బాలీవుడ్ లో ఇప్పుడు బిజీగా మారింది. ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి.

More

Related Stories