
కియారా అద్వానీ తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాతో బ్రేకప్ చెప్పుకొంది అనేది పాత వార్తే. ప్రస్తుతం ఆమె సింగిల్. ఈ విషయాన్నీ ద్రువీకరించుకునేందుకు ఒక జర్నలిస్ట్ తెలివిగా ప్రశ్న వేశారు కియారాకి.
“మీ జీవితం నుంచి బయటికి వెళ్లిన ఎవరినైనా మర్చిపోవాలని అనుకుంటున్నారా.”- అనేది ప్రశ్న. “నో. నా లైఫ్ జర్నీలో పరిచయమైన, తారసపడ్డవారందరితో మంచి అనుభూతులున్నాయి. ఎవరినీ మర్చిపోను,” అని ఆమె నుంచి సమాధానం వచ్చింది.
హీరోయిన్ గా ఇప్పటికే 10 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకొంది ఈ బ్యూటీ. దాంతో, మీడియా ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలో నేర్చుకొంది. బాలీవుడ్ మీడియా వార్తల ప్రకారం కియారా, ఆమె బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ స్నేహపూర్వకంగానే విడిపోయారు. ఇద్దరి దారులు, ఆలోచనలు ఒకటిగా ఉండట్లేదని అర్థం చేసుకొని విడిపోయినట్లు టాక్.
అతని గురించి మాత్రం ఎలాంటి బ్యాడ్ గా మాట్లాడడం లేదు. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఈ విషయంలో స్పందించడం లేదు.